Telangana: రిపోర్టరుపై పటాన్ చెరు ఎమ్మెల్యే తిట్ల దండకం... వైరల్ అవుతున్న ఆడియో ఇదిగో!

Viral Audio Clip of Patancheru MLA Mahipal Reddy
  • భూ కబ్జాలపై వార్త రాసిన సంతోష్ అనే విలేకరి
  • చేతులు నరుకుతానంటూ ఎమ్మెల్యే వార్నింగ్
  • మండిపడుతున్న జర్నలిస్ట్ సంఘాలు
తెలంగాణ పరిధిలోని పటాన్ చెరు ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత మహిపాల్ రెడ్డి, ఓ విలేకరిని బెదిరిస్తూ చేసిన కాల్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సదరు రిపోర్టర్ పేరు సంతోష్ అని తెలుస్తుండగా, జాతీయ రహదారి వెంబడి భూకబ్జాలపై ఓ వార్తను రాయడమే అతను చేసిన పాపమైంది. సంతోష్ తో ఫోన్ లో మాట్లాడిన మహిపాల్ రెడ్డి, కాళ్లు, చేతులు నరుకుతానంటూ, చంపేస్తానంటూ, తన పేరు రాయడానికి నువ్వెవడివిరా? అంటూ రెచ్చిపోయారు.

వెంటనే తన వద్దకు రావాలని హుకుం జారీ చేశారు. కావాలంటే తన కాల్ రికార్డు చేసుకోవచ్చని, తానేమీ భయపడేది లేదని, దిక్కున్న చోట చెప్పుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఈ ఆడియో క్లిప్ వైరల్ కావడంతో జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. వెంటనే మహిపాల్ రెడ్డి బహిరంగంగా క్షమాపణలు చెప్పకుంటే, ఆందోళనకు దిగుతామని తేల్చి చెప్పాయి. 
Telangana
Patancheru
Mahipal Reddy
Viral Audio

More Telugu News