Pawan Kalyan: ఉదయ్ పూర్ లో అన్నయ్య నాగబాబుతో పవన్ ఇలా..!

Pawan Kalyan arrives Udaypaur to attend Niharika marriage
  • రేపు నిహారిక పెళ్లి
  • రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో వివాహ మహోత్సవం
  • ఇప్పటికే ఉదయ్ పూర్ లో సందడి చేస్తున్న మెగా కుటుంబాలు
  • కొద్దిసేపటి కిందట ఉదయ్ పూర్ చేరుకున్న పవన్ కల్యాణ్
  • పవన్ రాకతో ప్యాలెస్ లో ఉత్సాహభరిత వాతావరణం
రాజస్థాన్ లోని చారిత్రక ప్రదేశం ఉదయ్ పూర్ ఇప్పుడు మెగా పెళ్లివేడుకకు వేదికగా నిలుస్తోంది. నాగబాబు కుమార్తె నిహారిక వివాహం బుధవారం రాత్రి 7.15 గంటలకు జరగనుంది. వరుడు గుంటూరు రేంజి ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు తనయుడు చైతన్య. ఈ పెళ్లికోసం కొన్నిరోజుల ముందే ఉదయ్ పూర్ చేరుకున్న మెగా ఫ్యామిలీ మెంబర్స్ సంగీత్, ఇతర కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయితేజ్, అల్లు అరవింద్, ఉపాసన, స్నేహారెడ్డి... ఇలా మెగాఫ్యామిలీ మొత్తం ఉదయ్ పూర్ లో ప్రత్యక్షమైంది.

ఈ పెళ్లికి వస్తాడా, రాడా? అన్న సందేహాలను పటాపంచలు చేస్తూ పవన్ కల్యాణ్ ఈ సాయంత్రం ఉదయ్ పూర్ లో ల్యాండయ్యారు. ఓ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఆయన ఉదయ్ పూర్ చేరుకున్నారు. పవన్ రాకతో ఉదయ్ పూర్ ప్యాలెస్ లో మరింత ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. నాగబాబు తన సోదరుడు పవన్ ను వెంటబెట్టుకుని ప్యాలెస్ పరిసరాలను చూపించారు. కాగా, ఈ పెళ్లికి పవన్ కుమారుడు అకీరా, కుమార్తె ఆద్య కూడా విచ్చేసినట్టు తెలుస్తోంది.
Pawan Kalyan
Udaypur
Niharika
Wedding
Mega Family
NisChay

More Telugu News