Blast: రేణిగుంట రైల్వే ట్రాక్ వద్ద భారీ పేలుడు

Huge blast at railway track near Renigunta
  • రేణిగుంట-తిరుపతి ప్రాంతంలో పేలుడు కలకలం
  • తారకరామానగర్ వద్ద విస్ఫోటనం
  • రైలు పట్టాల పక్కనే ఉన్న డబ్బాలో పేలుడు పదార్థాలు
  • డబ్బాను కదిపిన మహిళ
  • పేలుడులో మహిళకు తీవ్ర గాయాలు
భారీ పేలుడుతో రేణిగుంట-తిరుపతి ప్రాంతం ఉలిక్కిపడింది. రేణిగుంట మండలం తారాకరామానగర్ వద్ద రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న ఓ డబ్బాను కదిలించడంతో ఒక్కసారిగా విస్ఫోటనం సంభవించింది. ఈ ఘటనలో శశికళ అనే పశువుల కాపరికి తీవ్రగాయాలు కాగా, ఆమెను ఆసుపత్రికి తరలించారు. రైల్వే ట్రాక్ పైకి పేలుడు పదార్థాలు ఎలా వచ్చాయన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఘటన జరిగిన సమయంలో అక్కడ వర్షం పడుతోంది. అక్కడే పశువులు మేపుతున్న శశికళ అనే మహిళ అనుమానాస్పదంగా కనిపించిన డబ్బాను కదిపింది. దాంతో పేలుడు ధాటికి శశికళ చేయి బాగా దెబ్బతింది. రైలు పట్టాలపై పేలుడు జరిగి ఉంటే ట్రాక్ దెబ్బతిని ఉండేదని పోలీసులు భావిస్తున్నారు.
Blast
Railway Track
Renigunta
Police

More Telugu News