Pawan Kalyan: ఉదయ్ పూర్ పయనమైన పవన్ కల్యాణ్... ఫొటోలు ఇవిగో!

Pawan Kalyan off to Udaypur to attend Niharika wedding
  • రేపు నిహారిక పెళ్లి
  • రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో వివాహం
  • ఇప్పటికే ఉదయ్ పూర్ చేరుకున్న మెగా కుటుంబ సభ్యులు
  • ఈ సాయంత్రం ప్రత్యేక విమానంలో బయల్దేరిన పవన్
  • ఫొటోలు వైరల్
జనసేనాని పవన్ కల్యాణ్ రాజకీయాలకు స్వల్ప విరామం ప్రకటిస్తూ రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కు పయనమయ్యారు. పవన్ సోదరుడు నాగబాబు కుమార్తె నిహారిక వివాహం రేపు ఉదయ్ పూర్ లో జరగనుంది. ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు అరవింద్ తదితరులంతా ఉదయ్ పూర్ చేరుకుని సందడి చేస్తున్నారు.

పవన్ లేని లోటు కనిపిస్తోందని అభిమానులు భావిస్తున్నంతలో మెగా ఫ్యాన్స్ అందరినీ సంతోషానికి గురిచేస్తూ పవన్ కల్యాణ్ ఈ సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఉదయ్ పూర్ బయల్దేరారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
Pawan Kalyan
Udaypur
Niharika
Wedding
Mega Family

More Telugu News