Queen: ఏషియన్ అకాడమీ క్రియేటివ్ అవార్డు కైవసం చేసుకున్న రమ్యకృష్ణ 'క్వీన్'

Ramyakrishna Queen won Asian Academy Creative Best Original Series
  • జయలలిత జీవితం ఆధారంగా 'క్వీన్'
  • ప్రధానపాత్ర పోషించిన రమ్యకృష్ణ
  • సింగపూర్ లో ప్రతిష్ఠాత్మక అవార్డుల కార్యక్రమం
  • ఒరిజినల్ సిరీస్ విభాగంలో విజేతగా నిలిచిన 'క్వీన్'
  • సంతోషం వ్యక్తం చేసిన రమ్యకృష్ణ
  • సీజన్-2 ప్రారంభిస్తామని వెల్లడి
పురచ్చితలైవి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన 'క్వీన్' వెబ్ సిరీస్ కు విశిష్ట పురస్కారం లభించింది. రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ సింగపూర్ లో జరిగి ఏషియన్ అకాడమీ క్రియేటివ్ అవార్డుల పండుగలో 'ఒరిజినల్ బెస్ట్ సిరీస్' విభాగంలో విజేతగా నిలిచింది. తాము గతేడాది డిసెంబరు 5న 'క్వీన్' (ట్రైలర్) ప్రదర్శనకు శ్రీకారం చుట్టామని, ఇప్పుడదే తేదీన విశిష్ట పురస్కారానికి 'క్వీన్' ఎంపికైందని నటి రమ్యకృష్ణ వెల్లడించారు.

తమ 'క్వీన్' కు పోటీగా అనే ఆసియా దేశాల నుంచి వచ్చిన వెబ్ చిత్రాలు బరిలో నిలిచాయని, అయినప్పటికీ తమ 'క్వీన్' లో ఉన్న కంటెంట్ విజయం సాధించిందని సంతోషం వ్యక్తం చేశారు. 'క్వీన్' ప్రాజెక్టులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ ఈ విజయంలో భాగముందని, త్వరలోనే 'క్వీన్ సీజన్ 2' షురూ చేస్తామని రమ్యకృష్ణ పేర్కొన్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత 2016 డిసెంబరు 5న మరణించిన సంగతి తెలిసిందే.
Queen
Best Original Series
Asian Academy Creative Awards
Singapore
Ramyakrishna
Jayalalitha
Tamilnadu

More Telugu News