Team India: మూడో టీ20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

Team India won the toss and opted to bowl first
  • సిడ్నీ వేదికగా చివరి టీ20 మ్యాచ్
  • ఇప్పటికే 2-0తో సిరీస్ చేజిక్కించుకున్న భారత్
  • అదే జట్టుతో బరిలో దిగుతున్న కోహ్లీ సేన
  • ఆసీస్ జట్టులో ఒక మార్పు
  • స్టొయినిస్ స్థానంలో జట్టులోకొచ్చిన కెప్టెన్ ఫించ్
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ క్రికెట్ మైదానం వేదికగా ఇవాళ మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే తొలి రెండు టీ20 మ్యాచ్ లు గెలిచిన కోహ్లీ సేన సిరీస్ కైవసం చేసుకోవడంతో ఈ మ్యాచ్ కు ఎలాంటి ప్రాధాన్యత లేదు. అయితే టీ20 మ్యాచ్ కాబట్టి వినోదానికి లోటు ఉండకపోవచ్చు.

ఆసీస్ జట్టులో ఒక మార్పు జరిగింది. గాయం నుంచి కోలుకున్న కెప్టెన్ ఆరోన్ ఫించ్ జట్టులోకి రాగా, ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్ కు తుది జట్టులో స్థానం లభించలేదు. ఇక, టీమిండియాలో ఎలాంటి మార్పులు లేవు. రెండో టీ20 ఆడిన జట్టే ఈ మ్యాచ్  లో బరిలో దిగుతోంది. రెండో మ్యాచ్ లో చిచ్చరపిడుగులా చెలరేగి ఆడిన హార్దిక్ పాండ్యపై అందరి దృష్టి ఉంటుందనడంలో సందేహంలేదు.
Team India
Toss
Australia
3rd T20
Sydney

More Telugu News