Farmers: నేడు భారత్ బంద్.. మద్దతిస్తున్న 24 పార్టీలు

  • వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన
  • నేటి ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు బంద్
  • చర్చల్లో కొనసాగుతున్న ప్రతిష్ఠంభన
24 political parties back in bharat bandh

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు నేడు తలపెట్టిన భారత్ బంద్‌కు 24 పార్టీలు తమ మద్దతు ప్రకటించాయి. ఇందులో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, డీఎంకే, ఆర్జేడీ, శివసేన, సమాజ్‌వాదీ పార్టీ, టీఎంసీ, టీఆర్ఎస్, ఎంఐఎం, శిరోమణి అకాలీదళ్ తదితర పార్టీలు ఉన్నాయి.

ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేటి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బంద్ నిర్వహించనున్నారు. కాగా, రైతు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం జరుపుతున్న చర్చలు కొలిక్కి రావడం లేదు. ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకపోవడంతో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. రైతు సంఘాలతో ప్రభుత్వం రేపు మరోమారు చర్చలు జరపనుంది.

More Telugu News