Phanikera Mallaiah: సీఎం కేసీఆర్ కు తన కుమార్తె పెళ్లి కార్డును అందించిన రైతు ఫణికర మల్లయ్య

Farmer Phanikera Mallaiah invites CM KCR to his daughter marriage
  • మరోసారి వార్తల్లోకెక్కిన రైతు ఫణికర మల్లయ్య
  • నాడు చంద్రబాబుతో వాదించిన రైతుగా గుర్తింపు
  • ఇవాళ సీఎం కార్యాలయానికి విచ్చేసిన మల్లయ్య
  • పెళ్లికి రావాలంటూ సీఎం కేసీఆర్ కు పిలుపు
ప్రత్యేక తెలంగాణ వస్తేనే తమకు భవిష్యత్ ఉంటుందని కొన్నేళ్ల కిందట చంద్రబాబునాయుడితో కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన రైతు ఫణికర మల్లయ్య ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. పొలంగట్టు పైనుంచే తెలంగాణ వాదాన్ని ఎలుగెత్తి చాటారు. ఆయన తాజాగా మరోసారి వార్తల్లోకెక్కారు.

తన బిడ్డ పెళ్లి సందర్భంగా సీఎం కేసీఆర్ ను ఆహ్వానించేందుకు కుమార్తెతో కలిసి ముఖ్యమంత్రి కార్యాలయానికి విచ్చేశారు. తన కుమార్తె పెళ్లికి తప్పకుండా రావాలని సీఎంను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఫణికర మల్లయ్య మాట్లాడుతూ, తాను కోరుకున్న రైతు తెలంగాణను నడిపిస్తున్నారంటూ హర్షం వ్యక్తం చేశారు. ఉద్యమ సారథిని పెళ్లికి పిలిచేందుకు వచ్చానని చెప్పారు. 
Phanikera Mallaiah
KCR
Wedding
Daughter
Chandrababu
Telangana

More Telugu News