Kodali Nani: చంద్రబాబును హైదరాబాద్ ప్రజలు డ్రైనేజీలో కలిపేశారు: కొడాలి నాని

Kodali Nani comments on Chandrababu
  • ఏలూరు ఘటనపై టీడీపీ రాజకీయాలు చేస్తోంది
  • ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకుంటోంది
  • నష్టపోయిన ప్రతి రైతును జగన్ ఆదుకుంటారు
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి పట్టిన శని చంద్రబాబేనని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చంద్రబాబును హైదరాబాద్ ప్రజలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో పెట్టారని ఎద్దేవా చేశారు. ఏలూరులో అంతుచిక్కని వ్యాధిపై టీడీపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ప్రజలను అభద్రతకు గురి చేసేలా వ్యవహరిస్తున్నారని చెప్పారు.

ప్రజల అస్వస్థత నేపథ్యంలో ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకుంటోందని అన్నారు. వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి రైతును ముఖ్యమంత్రి జగన్ ఆదుకుంటారని చెప్పారు. ఈ రోజు నిర్వహించిన కృష్ణా జిల్లా సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ కొడాలి నాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి కూడా హాజరయ్యారు.
Kodali Nani
Jagan
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News