Rythu Bandhu: డిసెంబరు 27 నుంచి మరో విడత రైతుబంధు... సీఎం కేసీఆర్ ఆదేశాలు

  • రెండో విడత రైతుబంధుపై సీఎం కేసీఆర్ సమీక్ష
  • జనవరి 7 వరకు రైతుబంధు సాయం
  • పది రోజుల్లో పంపిణీ పూర్తికావాలన్న సీఎం
  • ప్రతి ఒక్క రైతు లబ్ది పొందేలా చూడాలని స్పష్టీకరణ
  • రూ.7,300 కోట్లు విడుదల చేయాలంటూ ఆదేశాలు
CM KCR reviews second phase Rythu  Bandhu

తెలంగాణలో రెండో విడత రైతుబంధు సాయానికి సన్నాహాలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అధికారులతో ఇవాళ ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. డిసెంబరు 27 నుంచి జనవరి 7 వరకు రైతుబంధు సాయం అందించనున్నట్టు సీఎం కేసీఆర్ ఓ ప్రకటనలో తెలిపారు.

రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతు లబ్ది పొందేలా చూడాలని, రైతుల ఖాతాలోకే నేరుగా డబ్బు జమ చేయాలని  అధికారులకు స్పష్టం చేశారు. ఈ రెండో విడత రైతుబంధు పంపిణీ కోసం రూ.7,300 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు.

మొదట తక్కువ విస్తీర్ణంలో భూమి కలిగిన రైతులకు రైతుబంధు అందజేయాలని, ఆ తర్వాత ఎక్కువ విస్తీర్ణంలో భూమి కలిగిన రైతులకు రైతుబంధు అందించాలని సూచించారు. ఇదంతా 10 రోజుల్లో ముగియాలని స్పష్టం చేశారు.

More Telugu News