Jagga Reddy: పీసీసీ అధ్యక్షుడికి డబ్బులు ఉండాలనేది తప్పుడు అభిప్రాయం: జగ్గారెడ్డి

  • కాంగ్రెస్ నేతల్లో భిన్నాభిప్రాయాలు ఉన్న మాట నిజమే
  • అంబానీ, అదానీలకు లబ్ధి చేకూర్చేందుకు కొత్త వ్యవసాయ చట్టాలు
  • భారత్ బంద్ కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు పలుకుతోంది
It is a misconception that the PCC president should have money says Jagga Reddy

పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో... కొత్త అధ్యక్షుడిని కాంగ్రెస్ హైకమాండ్ ఎంపిక చేయనుంది. ఇప్పటికే పలువురి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా జగ్గారెడ్డి మాట్లాడుతూ, పీసీసీ అధ్యక్షుడి రేసులో తాను కూడా ఉన్నానని చెప్పారు. కాంగ్రెస్ నేతల్లో భిన్నాభిప్రాయాలు ఉన్న సంగతి నిజమేనని... కానీ, నేతల మధ్య మాత్రం ఐక్యత ఉందని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడికి డబ్బులు ఉండాలనేది తప్పుడు అభిప్రాయం మాత్రమేనని అన్నారు.

రైతులను నాశనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని జగ్గారెడ్డి మండిపడ్డారు. అంబానీ, అదానీ, అమెజాన్ కు లబ్ధి చేకూర్చేందుకే కొత్త చట్టాలు తెచ్చారని విమర్శించారు. ఈ చట్టాల వల్ల రైతులే లేకుండా పోతారని అన్నారు. రైతులు చేపట్టిన భారత్ బంద్ కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు పలుకుతుందని చెప్పారు. తాను సంగారెడ్డిలో హైవేపై కూర్చుంటానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీని సమావేశపరిచి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.

More Telugu News