Pawan Kalyan: అంతుచిక్కని వ్యాధితో 300 మంది ఆసుపత్రుల్లో చేరడం దురదృష్టకరం: పవన్ కల్యాణ్

Pawan Kalyan response on Eluru mysterious decease
  • ఏం జరుగుతోందో తెలియక కుటుంబీకులు భయాందోళనకు గురవుతున్నారు
  • బాధితులకు ప్రభుత్వం అండగా ఉండాలి
  • ఏలూరుకు వైద్య బృందాన్ని పంపిస్తున్నాం

ఏలూరు నగరంలో అంతు చిక్కని వ్యాధితో 300 మందికి పైగా ఆసుపత్రుల్లో చేరడం దురదృష్టకరమని జనసేనాని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ వారికి వచ్చిన వ్యాధి ఏమిటో తెలియక వారి కుటుంబీకులు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు ఈ విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు.

ఏలూరులో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో బాధితులను విజయవాడకు తీసుకొస్తున్నారని తెలిసి తమ విజయవాడ నేతలను అప్రమత్తం చేశామని పవన్ చెప్పారు. అవసరమైన వారికి తగిన సహాయం చేయాలని వారికి చెప్పామని తెలిపారు. ప్రస్తుత సమయంలో వైద్య నిపుణులు బాధితులకు ఎంత సాయం చేయగలిగితే అంత చేయాలని కోరారు. బాధితులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉండాలని అన్నారు. బాధితులంతా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు.

ఏలూరు పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించడానికి జనసేనలో క్రియాశీలకంగా పని చేస్తున్న ముగ్గురు వైద్య నిపుణులను పంపిస్తున్నామని పవన్ తెలిపారు. తమ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఈ బృందానికి నేతృత్వం వహిస్తారని చెప్పారు. రేపు ఈ బృందం ఏలూరులో పర్యటిస్తుందని తెలిపారు. వ్యాధి తీవ్రంగా ఉన్న ప్రాంతాలలో పర్యటించి పరిస్థితులను పరిశీలిస్తారని అన్నారు. ప్రజలు, బాధిత కుటుంబాలతో మాట్లాడి తగిన సలహాలను అందిస్తారని చెప్పారు.

  • Loading...

More Telugu News