Somu Veerraju: నటుడు రాజేంద్రప్రసాద్ నివాసానికి వెళ్లిన సోము వీర్రాజు

AP BJP President Somu Veerraju met actor Rajendra Prasad
  • రాజేంద్రప్రసాద్ ను కలిసిన సోము వీర్రాజు
  • ఏపీ బీజేపీ చీఫ్ ను సాదరంగా ఆహ్వానించిన రాజేంద్రుడు
  • శాలువా కప్పి గౌరవించిన వైనం
  • రాజేంద్రుడి నివాసంలో హేమ సందడి
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇవాళ టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ను కలిశారు. రాజేంద్రప్రసాద్ నివాసానికి వెళ్లిన సోము వీర్రాజు కొద్దిసేపు అక్కడే గడిపారు. ఈ సందర్భంగా నటి హేమ కూడా అక్కడే ఉన్నారు. దీనిపై సోము వీర్రాజు ట్విట్టర్ లో వెల్లడించారు. ప్రముఖ హాస్యనటుడు, సోదర సమానులు డాక్టర్ రాజేంద్రప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిశానని తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమకు, తెలుగు ప్రజలకు ఆయన అందిస్తున్న సేవల పట్ల  అభినందించానని పేర్కొన్నారు. కాగా, తన నివాసానికి వచ్చిన ఏపీ బీజేపీ చీఫ్ ను రాజేంద్రప్రసాద్ సాదరంగా ఆహ్వానించారు. ఆయనకు శాలువా కప్పి గౌరవించారు. అనంతరం ఇరువురూ కొద్దిసేపు ముచ్చటించారు.
Somu Veerraju
Rajendra Prasad
Hema
BJP
Andhra Pradesh
Tollywood

More Telugu News