Nishant Singh: అరేబియా సముద్రంలో గల్లంతైన మిగ్ విమాన పైలెట్ మృతదేహం లభ్యం

  • గత నెలలో కూలిపోయిన మిగ్-29కే విమానం
  • ఓ పైలెట్ ను కాపాడిన సహాయ బృందాలు
  • నిశాంత్ సింగ్ అనే మరో పైలెట్ గల్లంతు
  • తీవ్రస్థాయిలో గాలింపు చర్యలు చేపట్టిన నేవీ
  • గోవా తీరానికి 30 కిమీ దూరంలో నిశాంత్ మృతదేహం
Missing pilot Nishant Singh dead body found near Goa coast

గత నెలలో మిగ్-29కే విమానం అరేబియా సముద్రంలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. నవంబరు 26న ఓ విమాన వాహక నౌక నుంచి నింగికెగిసిన ఈ మిగ్ పోరాట విమానం కొద్దిసేపటికే గ్రౌండ్ కంట్రోల్ తో సంబంధాలు కోల్పోయింది. తీరానికి కొద్దిదూరంలో సముద్రంలో కూలిపోయింది.

ఈ ఘటనలో ఓ పైలెట్ ను సహాయ బృందాలు కాపాడగా, నిశాంత్ సింగ్ అనే మరో పైలెట్ గల్లంతయ్యాడు. నిశాంత్ సింగ్ కోసం భారత నేవీ బృందాలు తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టాయి. తాజాగా అతడి మృతదేహాన్ని గోవా తీరానికి 30 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. నీటి ఉపరితలానికి 70 మీటర్ల లోతు నుంచి నిశాంత్ సింగ్ మృతదేహాన్ని వెలికితీశారు.

More Telugu News