Kalyan Krishna: నిర్మాతగా మారుతున్న మరో దర్శకుడు

  • 'సోగ్గాడే చిన్ని నాయనా'తో దర్శకుడిగా పేరు
  • ఓటీటీ కోసం చిన్న బడ్జెట్ చిత్రనిర్మాణం
  • దీని ద్వారా నూతన దర్శకుడి పరిచయం  
  • 'బంగార్రాజు'కి దర్శకత్వం వహించనున్న కల్యాణ్  
Another director turns as producer in Tollywood

ఇటీవలి కాలంలో మన దర్శకులలో చాలామంది నిర్మాతలుగా కూడా మారుతుండడాన్ని మనం చూస్తూనే వున్నాం. ఒకటి, రెండు సినిమాలు చేసిన దర్శకులు కూడా నిర్మాతలుగా సొంత బ్యానర్లు నెలకొల్పి, చిన్న చిత్రాల నిర్మాణం చేస్తున్నారు. ఆ బ్యానర్లపై నిర్మించే చిత్రాలకు కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తున్నారు. అదే కోవలో టాలీవుడ్ లో మరో దర్శకుడు కూడా నిర్మాతగా మారుతున్నాడు.

ఆమధ్య అక్కినేని నాగార్జునతో 'సోగ్గాడే చిన్ని నాయనా' వంటి హిట్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు కల్యాణ్ కృష్ణ ఇప్పుడు ఓ చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం వేగంగా దూసుకుపోతున్న ఓటీటీ మాధ్యమం కోసం ఆయన ఈ చిన్న బడ్జెట్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా తన మిత్రుడు నవీన్ గాంధీని ఆయన దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడట.

ఇదిలావుంచితే, మరోపక్క 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రానికి సీక్వెల్ చేసే ప్రయత్నాలను కల్యాణ్ కృష్ణ గతకొంతకాలంగా చేస్తున్నాడు. ఆ సినిమాలోని బంగార్రాజు పాత్రను ప్రధానంగా తీసుకుని 'బంగార్రాజు' టైటిల్ తో దీనికి కథను కూడా సిద్ధం చేశారు. ఇక నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని బట్టి ఈ ప్రాజక్టు ముందుకు వెళుతుంది.

More Telugu News