Varun Dhawan: బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ కు కరోనా

Varun Dhawan tests positive for coronavirus
  • కరోనా సోకినట్టు స్వయంగా ప్రకటించిన వరుణ్ ధావన్
  • షూటింగ్ లో పాల్గొన్న తర్వాత కరోనా బారిన పడ్డానని వెల్లడి
  • ప్రస్తుత పరిస్థితుల్లో జీవితం నిలకడగా లేదని వ్యాఖ్య

యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఒక్కసారిగా తలకిందులు చేసింది. అన్ని దేశాలు కరోనా దెబ్బకు షట్ డౌన్ కావాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ మహమ్మారి బారిన పడి ఎందరో ప్రముఖులు, సెలబ్రిటీలు ప్రాణాలను కోల్పోయారు. ప్రపంచంలో రెండో అతి పెద్ద సినీ ప్రపంచమైన బాలీవుడ్ లో సైతం ఎందరో ప్రముఖులు దీని బారిన పడ్డారు. తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆయనే స్వయంగా వెల్లడించాడు.

కరోనా తీవ్రత తగ్గిన తర్వాత మళ్లీ సినిమా షూటింగులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. షూటింగులో పాల్గొన్న తర్వాత తనకు కరోనా సోకిందని ధావన్ చెప్పాడు. జీవితమనేది ప్రస్తుత పరిస్థితుల్లో నిలకడగా లేదని అన్నాడు. కరోనా విషయంలో ప్రతి ఒక్కరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. తాను కూడా చాలా జాగ్రత్తగా ఉన్నానని తెలిపాడు. ప్రస్తుత ప్రతికూల పరిస్థితిని ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు.

  • Loading...

More Telugu News