Saif Ali Khan: ప్రభాస్ 'ఆదిపురుష్' పై వ్యాఖ్యలు... క్షమాపణలు చెప్పిన బాలీవుడ్ సీనియర్ హీరో

Bollywood hero Saif apologizes to his comments about Prabhas Adipurush
  • పాన్ ఇండియా సినిమాగా ఆదిపురుష్
  • ప్రభాస్ హీరోగా చిత్రం
  • రాముడి పాత్ర పోషిస్తున్న ప్రభాస్
  • రావణుడిగా సైఫ్ అలీ ఖాన్
  • రావణుడి వైఖరి తప్పేం కాదన్న సైఫ్
  • హిందుత్వ వాదుల ఆగ్రహం
పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న చిత్రం ఆదిపురుష్. ప్రధానంగా బాలీవుడ్ చిత్రం అయినా ప్రభాస్ మార్కెట్ రీత్యా తెలుగు సహా అనేక భాషల్లో రూపొందనుంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్ర పోషిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటించనున్నారు.

ఇక తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఆదిపురుష్ చిత్రంపై సైఫ్ అలీ ఖాన్ వెల్లడించిన సంగతులు వివాదాస్పదం అయ్యాయి. 'రాముడితో రావణుడు ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది? రావణుడి వైఖరి తప్పేంకాదు, రావణుడిలో మానవతా దృక్పథాన్ని చాటే విధంగా ఉంటుందీ చిత్రం' అని సైఫ్ పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై హిందుత్వ వాదులు మండిపడుతున్నారు. హిందువులకు బద్ధవ్యతిరేకి అయిన రావణుడిని ఎలా మంచిగా చూపిస్తారంటూ హిందుత్వ వాదులు మండిపడ్డారు. ఆదిపురుష్ లో రావణుడ్ని మంచివాడిగా చూపిస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.

దాంతో తన వ్యాఖ్యలపై పునరాలోచనలో పడిన సైఫ్... క్షమాపణలు తెలిపారు. తన వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని అన్నారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని స్పష్టం చేశారు. తనకు రాముడు అంటే ఎంతో గౌరవం ఉందని, ధర్మానికి ప్రతిరూపం రాముడు అని కొనియాడారు. తమ చిత్రంలో చెడుపై మంచి సాధించిన విజయాన్నే చూపించబోతున్నామని వివరించారు.
Saif Ali Khan
Adipurush
Prabhas
Ramcharan
Ravan
Bollywood

More Telugu News