ఢిల్లీలో అమిత్ షాను కలిసిన విజయశాంతి... బీజేపీలో చేరికకు రంగం సిద్ధం!

06-12-2020 Sun 20:51
  • రేపు బీజేపీలో చేరనున్న విజయశాంతి
  • ఢిల్లీలో మంతనాలు
  • బీజేపీ అగ్రనేత అమిత్ షాతో చర్చలు
  • విజయశాంతి వెంట కిషన్ రెడ్డి, బండి సంజయ్, వివేక్
Vijayasanthi met Home Ministeter Amit Shah in Delhi

ప్రముఖ నటి, తెలంగాణ రాజకీయవేత్త, మాజీ ఎంపీ విజయశాంతి బీజేపీలో చేరికకు రంగం సిద్ధమైంది. విజయశాంతి ఈ సాయంత్రం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాను కలిశారు. అమిత్ షాకు శాలువా కప్పి గౌరవించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, బీజేపీ నేత వివేక్ పాల్గొన్నారు. కాగా, విజయశాంతి రేపు బీజేపీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె పార్టీలో చేరనున్నారు. అటు, విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రచారం జరుగుతోంది.