గేటు దూకి తెలంగాణ భవన్ లోకి దూసుకెళ్లిన యువతి.... వీడియో ఇదిగో!

06-12-2020 Sun 16:53
  • తెలంగాణ భవన్ వద్ద యువతి హంగామా
  • యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ఓ మతానికి సంబంధించిన నినాదాలు చేసిన యువతి
  • విచారణ జరుపుతున్న పోలీసులు
Woman creates ruckus at Telangana Bhavan in Hyderabad
హైదరాబాదులోని తెలంగాణ భవన్ వద్ద ఓ యువతి హంగామా సృష్టించింది. గేటు దూకి లోపలికి చొరబడిన ఆ యువతి పెద్దగా నినాదాలు చేస్తూ అలజడి రేపింది. దాంతో మహిళా పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. కార్యాలయ భవనంలోకి వెళ్లకుముందే ఆ యువతిని దొరకబుచ్చుకుని బయటికి తీసుకొచ్చారు. అనంతరం ఆమెను అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు. కాగా, తెలంగాణ భవన్ లో ప్రవేశించిన సందర్భంగా ఆమె ఓ మతానికి సంబంధించిన నినాదాలు చేయడం, దేవుని ఆశీర్వాదాలు అంటూ మాట్లాడడం వీడియోలో రికార్డయింది.