భర్త కంపెనీని ప్రమోట్ చేస్తోన్న హీరోయిన్ కాజల్.. వీడియో ఇదిగో ‌

06-12-2020 Sun 13:09
  • వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకున్న కాజల్
  • గౌతమ్‌ ప్రముఖ డిజైనింగ్‌ కంపెనీ అధినేత
  • ఈ కామర్స్‌ సంస్థ డిస్కర్న్‌ లివింగ్‌కి  బ్రాండ్‌ అంబాసిడర్‌గా కాజల్
  • బ్రాండ్‌ పబ్లిసిటీ బ్రోచర్స్‌ త్వరలోనే విడుదల
kajal promoting her husband company video goes viral

హీరోయిన్ కాజల్ అగర్వాల్  ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయనతో కలిసి ఆమె హనీమూన్‌లో ఎంజాయ్ చేసింది. గౌతమ్‌ ప్రముఖ డిజైనింగ్‌ కంపెనీ అధినేత. ఇప్పుడు ఆయన కంపెనీని ప్రమోట్ చేసే బాధ్యతలను కాజల్ తన భుజాలపై వేసుకుంది.

గౌతమ్ ఈ కామర్స్‌ సంస్థ డిస్కర్న్‌ లివింగ్‌కి  బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిపోయింది. ఆ బ్రాండ్‌ పబ్లిసిటీ బ్రోచర్స్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు కాజల్‌ తన ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే.