Farmers: నిత్యావసర సరుకులతో పెద్ద ఎత్తున ఢిల్లీకి రైతులు

  • రైతులకు రోజురోజుకు పెరుగుతున్న మద్దతు
  • నెలకు సరిపడా నిత్యావసరాలతో రాజధానికి బయలుదేరిన రైతులు
  • ప్రభుత్వం, రైతుల మధ్య కొనసాగుతున్న ప్రతిష్ఠంభన
Farmers left for delhi with one month food on trctors

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ‘చలో ఢిల్లీ’ ఆందోళన చేపట్టిన రైతులకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. రైతులను శాంతింప జేసేందుకు కేంద్రం చర్చలు జరుపుతున్నప్పటికీ ప్రతిష్ఠంభన మాత్రం తప్పడం లేదు. ఫలితంగా ఆందోళన విరమించేందుకు రైతులు ససేమిరా అంటున్నారు.

మరోవైపు ఎల్లుండి తలపెట్టిన భారత బంద్‌కు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఢిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళనలో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి కూడా రైతులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. బిజ్నోర్, ముజఫర్‌నగర్, షామ్లీ, మీరట్ తదితర జిల్లాలకు చెందిన వందలాదిమంది రైతులు నెలకు సరిపడా నిత్యావసరాలతో ట్రాక్టర్లపై ఢిల్లీకి బయలుదేరారు.

More Telugu News