Corona Virus: బీ కేర్‌ఫుల్.. టీకా కోసం జరిగే తొక్కిసలాటలో పేద దేశాలు నలిగిపోవచ్చు: హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

  • టీకా ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు
  • మహమ్మారి అంతమైందని ఇక అనుకోవచ్చు
  • టీకాను ప్రజల ఆస్తిగా పరిగణించాలి
vaccine trials show world can dream of pandemics end

ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వివిధ దేశాలు అభివృద్ధి చేసిన టీకాలు ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. టీకా కోసం భారీ తొక్కిసలాటలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఉన్నతస్థాయి సమావేశంలో మాట్లాడిన ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రియేసిస్ ఈ హెచ్చరికలు జారీ చేశారు.

కరోనా టీకా ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు వస్తున్నాయన్న ఆయన.. కరోనా కథ ఇక ముగిసిందనుకోవచ్చన్నారు. టీకా కోసం జరిగే తొక్కిసలాటలో పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు నలిగిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. టీకాను ప్రైవేటు సరుకుగా కాకుండా ప్రజల ఆస్తిగా పరిగణించాలని కోరారు.

More Telugu News