అనసూయ కొత్త సినిమా.. సిల్క్ స్మిత బయోపిక్?

05-12-2020 Sat 21:45
  • సినిమాలలో సెలెక్టివ్ గా చేస్తున్న అనసూయ 
  • 'రంగస్థలం'లోని రంగమ్మత్త పాత్రతో మంచి పేరు
  • తాజాగా తమిళంలో కమిట్ అయిన సినిమా
  • విజయ్ సేతుపతి హీరో.. సోషల్ మీడియాలో ఫొటో     
Anasuya to play in Silk Smitha biopick

సినీ నటి అనసూయకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యాంకర్ గా కెరీర్ ప్రారంభించి సినీనటిగా మారిన ఈ ముద్దుగుమ్మ సినిమాల పరంగా వస్తున్న ప్రతీ ఆఫర్ నూ అంగీకరించదు. పాత్ర తనకు నచ్చితేనే ఓకే చెబుతుంది. ఈ విషయంలో ఎటువంటి మొహమాటాలకు పోదు. ఈ క్రమంలో ఆమధ్య 'రంగస్థలం' సినిమాలో ఆమె చేసిన రంగమ్మత్త పాత్ర ఆమెకు ఎంతో పేరుతెచ్చింది.    

ప్రస్తుతం మరికొన్ని సినిమాలలో ప్రత్యేక పాత్రలు పోషిస్తున్న అనసూయ తాజగా తమిళంలో ఓ చిత్రాన్ని అంగీకరించింది. 'మరో మంచి కథ.. కొత్త ఆరంభం .. కోలీవుడ్.. తమిళ్..' అంటూ తాజాగా అనూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెడుతూ ఓ ఫొటో కూడా పోస్ట్ చేసింది. ఇందులో అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ పోజు ఇచ్చింది. ఈ సినిమాలో హీరో విజయ్ సేతుపతితో కలసి ఆమె నటించనుందని తెలుస్తోంది.

ఈ చిత్రం కోసమే ఇటీవల ఆమె చెన్నై వెళ్లినట్టు చెబుతున్నారు. ఇక ఈ సినిమా ఒకప్పటి శృంగారతార సిల్క్ స్మిత బయోపిక్ గా రూపొందనున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.