మోదీ తీసుకువచ్చిన చట్టాలు రైతుల పాలిట ఉరితాళ్లు: రేవంత్ రెడ్డి

05-12-2020 Sat 21:17
  • అన్నదాతల పోరాటం అభినందనీయమన్న రేవంత్
  • ఇవి నల్ల చట్టాలన్న విషయం రైతులు గుర్తించారని వెల్లడి
  • బీజేపీకి ఎన్నికలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని వ్యాఖ్యలు
  • బంద్ ను విజయవంతం చేయాలని పిలుపు
Revanth Reddy slams Modi and new Agri Acts

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తాజా రాజకీయ పరిణామాలపై స్పందించారు. అంబానీలు, అదానీల కోసమే మోదీ కొత్త చట్టాలు తెచ్చారని, మోదీ తీసుకువచ్చిన చట్టాలు రైతుల పాలిట ఉరితాళ్లని అభివర్ణించారు. దేశంలో పదిరోజులుగా రైతులు తీవ్ర పోరాటం చేస్తుంటే బీజేపీ అధినాయకత్వంలో ఏమాత్రం చలనం లేదని విమర్శించారు.

 బీజేపీకి ఎన్నికలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని ఆరోపించారు. నిద్రాహారాలు పట్టించుకోకుండా రైతులు చేస్తున్న పోరాటం అభినందనీయమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇవి నల్ల చట్టాలన్న విషయాన్ని రైతులు గుర్తించారని, అందుకే పోరాడుతున్నారని తెలిపారు. రైతులు పిలుపునిచ్చిన మేరకు డిసెంబరు 8న బంద్ ను జయప్రదం చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.