ఫ్రాన్స్ లో విజయ్ మాల్యా ఆస్తుల జప్తు

05-12-2020 Sat 18:33
  • రుణాలు ఎగ్గొట్టి బ్రిటన్ పారిపోయిన మాల్యా
  • 2016 నుంచి మాల్యా వ్యవహారాలపై దర్యాప్తు
  • ఇప్పటివరకు రూ.11,231 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనం
Vijay Mallya assets in France was seized

ఒకప్పుడు గొప్పగా వెలిగిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా బ్యాంకులకు రుణాల ఎగవేత కారణంగా బ్రిటన్ పారిపోయిన సంగతి తెలిసిందే. 2016 నుంచి మాల్యా వ్యవహారాలపై దర్యాప్తు జరుగుతోంది. మాల్యాను భారత్ రప్పించేందుకు కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆయన ఆస్తులను ఒక్కొక్కటిగా జప్తు చేస్తోంది.

తాజాగా ఫ్రాన్స్ లో మాల్యాకు చెందిన రూ.14.35 కోట్ల విలువ చేసే ఆస్తులను అక్కడి అధికారుల సాయంతో స్వాధీనం చేసుకుంది. దాంతో ఇప్పటివరకు జప్తు చేసిన మాల్యా ఆస్తుల విలువ రూ.11,231 కోట్లకు చేరింది. ఈ మేరకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వెల్లడించింది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ బ్యాంకు ఖాతా నుంచి పెద్ద మొత్తంలో నిధులను మాల్యా విదేశాలకు తరలించినట్టు గుర్తించామని ఈడీ పేర్కొంది.