జయలలిత గెటప్‌లో తన ఫొటోలను పోస్ట్ చేసిన హీరోయిన్ కంగన

05-12-2020 Sat 13:41
  • తలైవి సినిమాలో నటిస్తున్న కంగన ర‌నౌత్ 
  • చేతిలో దస్త్రాలు పట్టుకుని, నుదుటిపై బొట్టు పెట్టుకున్న కంగన
  • సంప్రదాయబద్ధంగా కనపడుతోన్న హీరోయిన్
kangana pics go viral

తమిళనాడు మాజీ సీఎం దివంగత జయ‌ల‌లిత జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న 'తలైవి' సినిమాలో హీరోయిన్ కంగన ర‌నౌత్  నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగులో తీసుకున్న కొన్ని ఫొటోలను ఆమె తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. తాజాగా, మరి కొన్ని ఫొటోలను ఆమె షేర్ చేసింది. అచ్చం జయలలితలా చీర కట్టుకొని, చేతిలో దస్త్రాలు పట్టుకుని, నుదుటిపై బొట్టు పెట్టుకుని సంప్రదాయబద్ధంగా ఆమె కనపడుతోంది.
    
పేదల ఆకలిని తీర్చుతూ, పార్టీ నేతలతో చర్చలు జరుపుతూ ఆమె కనపడుతోంది. జయమ్మ వర్థంతి సందర్భంగా తలైవి సినిమాలోని ఈ ఫొటోలను షేర్ చేస్తున్నట్లు కంగన తెలిపింది. ఈ సందర్భంగా సినిమా యూనిట్ సభ్యులకు ఆమె థ్యాంక్స్ తెలిపింది.