Komatireddy Venkat Reddy: కోమ‌టిరెడ్డి వెంకటరెడ్డిని టీపీసీసీ చీఫ్‌గా ప్ర‌కటించ‌నున్న ఏఐసీసీ?

  • రేసులో కోమటిరెడ్డి, రేవంత్‌రెడ్డి, శ్రీధర్‌బాబు 
  • కోమటిరెడ్డికే ఇవ్వాలని కాంగ్రెస్ యోచన
  • దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉత్తమ్, రేవంత్, శ్రీధర్ బాబు ఫెయిల్
komati reddy as tpcc president

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి‌ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో, ప్రస్తుతం పీసీసీ అధ్యక్ష పదవి రేసులో కాంగ్రెస్‌ ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఉన్నారు.

అయితే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించిన కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డిని ఆ పార్టీ అధిష్ఠానం పీసీసీగా ప్ర‌క‌టించ‌నున్నట్లు తెలుస్తోంది. ఆయన తెలంగాణ మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో అత్య‌ధిక మునిసిపాలిటీల్లో తమ అభ్యర్థులను గెలిపించిన కాంగ్రెస్ నేతగా ఉన్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉత్తమ్, రేవంత్, శ్రీధర్ బాబు అంతగా ప్రభావం చూపలేకపోయారు. తమ నియోజక వర్గాల్లో సొంత ప్రాంతాల్లో తమ పార్టీ నేతలను గెలిపించుకోలేకపోయారు.

దీంతో వెంకట్ రెడ్డికే టీపీసీసీ పదవి దక్కుతుందని అంచనా.  అంతేగాక, జీహెచ్ఎంసీ ఓట‌మికి బాధ్య‌త వ‌హిస్తూ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి బాట‌లో రేవంత్ రెడ్డి ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వికి సాయంత్రం రాజీనామా స‌మ‌ర్పించనున్నట్లు సమాచారం.‌ తెలంగాణ టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్లుగా కాంగ్రెస్ పార్టీ ముగ్గురుని ఎంపిక చేసే అవ‌కాశం ఉంది.

More Telugu News