Chandrababu: అన్నింటా అసత్యాలతో మోసం చేశారు: దేవినేని ఉమ

  • తెదేపా శాసన సభ్యులు మాట్లాడితే మోసాలు బయటకు వస్తాయన్న భయం
  • అందుకే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు
  • సీపీఎస్ రద్దు, పీపీఏలు, పెన్షన్లు, అన్నింటా అసత్యాలతో మోసం
  • ఉపాధిలేక అల్లాడుతున్న ప్రజలపై పన్ను  
chandra babu slams ycp

అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తానంటూ గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన హామీకి సంబంధించిన వీడియోను చూపిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన విమర్శల వీడియోను ఆ పార్టీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు పోస్ట్ చేశారు. జగన్ ఇచ్చిన మాటను తప్పారని, మడమతిప్పారని విమర్శలు గుప్పించారు.

‘తెదేపా శాసన సభ్యులు మాట్లాడితే మోసాలు బయటకు వస్తాయన్న భయంతో సస్పెండ్ చేశారు. సీపీఎస్ రద్దు, పీపీఏలు, పెన్షన్లు, రైతుల ప్రీమియం అన్నింటా అసత్యాలతో మోసం చేశారు. ఉపాధిలేక అల్లాడుతున్న ప్రజలపై పన్ను వేసేందుకు జుట్టు, చెప్పులు తప్ప ఇంకేం మిగిలాయి అంటున్న చంద్రబాబు నాయుడి మాటలకు సమాధానం చెప్పండి జగన్’ అని దేవినేని ఉమ విమర్శించారు. కాగా, అసెంబ్లీ సమావేశాల్లో చివరిరోజున కూడా తొమ్మిది మంది టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

More Telugu News