హైదరాబాద్‌లో వైద్య విద్యార్థిని‌ ఆత్మహత్య

05-12-2020 Sat 12:10
  • బేగంపేటలో ఘటన
  • గాంధీ ఆసుపత్రి కళాశాలలో చదువుతోన్న ఝాన్సీ
  • స్వస్థలం మెదక్‌ జిల్లాలోని నర్సాపూర్‌
  • మానసిక ఒత్తిడి వల్లే ఆత్మహత్య?
medical student commits suicide

హైదరాబాద్‌లోని బేగంపేటలో ఓ వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. గాంధీ ఆసుపత్రి కళాశాలలో మెడిసిన్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఝాన్సీ అనే విద్యార్థిని బేగంపేటలోని తానుంటోన్న నివాసంలో ఉరేసుకుంది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ఆమె ఆత్మహత్యకు సంబంధించి కేసు నమోదు చేశారు. ఆమె మానసిక ఒత్తిడితో ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఝాన్సీ స్వస్థలం మెదక్‌ జిల్లాలోని నర్సాపూర్‌ అని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలపై ఆరా తీస్తున్నారు.