ఆసీస్‌తో టీ20 మ్యాచ్‌లకు దూరమైన ర‌వీంద్ర జ‌డేజా!

05-12-2020 Sat 10:59
  • అద్భుతంగా రాణిస్తున్న జడేజా
  • తొలి టీ20 మ్యాచ్‌లో గాయం
  • జ‌డేజా స్థానంలో జట్టులోకి శార్దూల్ ఠాకూర్‌
TeamIndia squad for T20I series against Australia

ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా టీ20 మ్యాచులు ఆడుతోన్న విషయం తెలిసిందే. ఆసీస్‌పై దూకుడుగా ఆడుతూ భారత్‌ను గెలిపిస్తోన్న రవీంద్ర జడేజా మిగతా రెండు టీ20 మ్యాచులకు దూరమవుతున్నాడు. ఆసీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో మిచ‌ల్ స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ చివ‌రి ఓవ‌ర్‌లో ఆయన గాయ‌ప‌డ్డాడు.

ఈ నేపథ్యంలో జడేజా రెండు మ్యాచ్‌ల‌కు దూరం అవుతాడని జ‌డేజా స్థానంలో జట్టులోకి శార్దూల్ ఠాకూర్‌ను తీసుకుంటున్నామని బీసీసీఐ తెలిపింది. ప్రస్తుతం జడేజాను అబ్జ‌ర్వేష‌న్‌లో పెట్టామ‌ని తెలిపింది. ఆయన గాయం నుంచి కోలుకునేందుకు అవ‌సరమైతే మ‌రిన్ని స్కాన్స్ చేస్తామ‌ని తెలిపింది. కాగా, వన్డే మ్యాచుల్లోనే కాకుండా, తొలి టీ20 మ్యాచ్‌లోనూ జడేజా రాణించిన విషయం తెలిసిందే. కేవ‌లం 23 బంతుల్లో 44 పరుగులు చేసి భార‌త స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.