పోలవరం కోసం రూ. 2,234 కోట్లు విడుదల.. త్వరలో ప్రత్యేక ఖాతాకు జమ!

05-12-2020 Sat 10:31
  • ప్రత్యేక ఖాతాకు డబ్బు జమ కానుందన్న అధికారులు
  • ఇప్పటివరకూ రూ. 8,507 కోట్ల రీయింబర్స్ మెంట్
  • ఇంకా రావాల్సింది రూ. 1,788 కోట్లు
Center Releases Above Two Thousand Crores Reembersment for Polavaram

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిమిత్తం నాబార్డు రూ. 2,234.28 కోట్లను విడుదల చేసింది. మరో మూడు, నాలుగు రోజుల్లో జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ నుంచి ఈ మొత్తం విడుదల కానుందని, ప్రత్యేక ఖాతాకు ఈ డబ్బు జమ కానుందని అధికారులు వెల్లడించారు.

ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుండగా, ఆ నిధులను కేంద్రం రీయింబర్స్ మెంట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ కేంద్రం నుంచి రూ. 8,507 కోట్లు ప్రాజెక్టుకు వెచ్చించిన వ్యయం కింద విడుదల కాగా, ఇంకా రూ. 1,788 కోట్లు రావాల్సి వుంది.