Rapaka Vara Prasad: వైసీపీలో చేరిన జనసేన ఎమ్మెల్యే రాపాక కుమారుడు వెంకట్ రామ్

  • జనసేన ఎమ్మెల్యేగా కొనసాగుతూనే వైసీపీకి రాపాక మద్దతు 
  • జనసేన కార్యక్రమాలకు దూరంగా
  • జగన్ సమక్షంలో రాపాక కుమారుడు వైసీపీ తీర్థం 
Janasena MLA Rapaka Vara Prasad Rao Son joins YSRCP

జనసేన ఎమ్మెల్యేగా కొనసాగుతూనే వైసీపీకి మద్దతు తెలుపుతోన్న రాపాక వరప్రసాద్ కుమారుడు రాపాక వెంకట్ రామ్ వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.  సాంకేతికంగా జనసేన ఎమ్మెల్యేగా కొనసాగనున్న రాపాక వరపస్రాద్ పార్టీ మారితే చిక్కులు రాకుండా ఉండేందుకే జనసేనలో కొనసాగుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన తరఫున పోటీ చేసి రాపాక వరప్రసాద్ గెలుపొందిన విషయం తెలిసిందే. జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయన. అయితే, జనసేన కార్యక్రమాలకు దూరంగా ఉండడమే కాకుండా, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా, ముఖ్యమంత్రి జగన్‌కు అనుకూలంగా ఆయన మాట్లాడుతూ ఉండడం గమనార్హం. అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీకి మద్దతుగా వ్యవహరించడం చేస్తున్నారు. అనేక సార్లు జగన్‌పై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు.

More Telugu News