బాలకృష్ణ కొత్త సినిమా.. 'బలరామయ్య బరిలో దిగితే..'!

05-12-2020 Sat 09:40
  • బోయపాటితో మూడో చిత్రం చేస్తున్న బాలకృష్ణ 
  • కథ సిద్ధం చేసిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్
  • నిర్మాణానికి ఏకే ఎంటర్ టైన్మెంట్స్  సన్నాహాలు
Balakrishna New film titled

మాస్ అంశాలతో ముడిపడిన యాక్షన్ సినిమాలలో అభినయం పరంగా నందమూరి బాలకృష్ణ తన విశ్వరూపాన్ని చూపిస్తారు. అందుకే, ఆయనతో సినిమా చేసే దర్శకులు ఇలాంటి పవర్ ఫుల్ సబ్జెక్టు.. పవన్ ఫుల్ పాత్రలను క్రియేట్ చేస్తుంటారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న మూడో సినిమా కూడా ఇదే తరహా కథతో సాగే చిత్రం. ఇప్పుడు ఈ కోవలోనే మరో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కు బాలకృష్ణ సిద్ధమవుతున్నారు.

'కందిరీగ', 'రభస' వంటి చిత్రాలను చేసి, ప్రస్తుతం 'అల్లుడు అదుర్స్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. 'బలరామయ్య బరిలో దిగితే..' అనే టైటిల్ తో ఈ దర్శకుడు ఓ పవర్ ఫుల్ సబ్జెక్టును బాలకృష్ణ కోసం సిద్ధం చేశారు. బాలయ్యకు కూడా ఈ కథ బాగా నచ్చినట్టు చెబుతున్నారు. వీరి కాంబినేషన్లో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాజక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.