రజనీకాంత్ గురించి ఇప్పుడే ఏమీ స్పందించలేను: కనిమొళి

05-12-2020 Sat 09:28
  • రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పిన రజనీకాంత్
  • ప్రస్తుతానికి కామెంట్ చేయబోను
  • రజనీ ఇంకా రాజకీయాల్లోకి రాలేదన్న కనిమొళి
Cant Comment on Rajani Politics says Kanimozhi

తాను రాజకీయాల్లోకి రానున్నానని, ఈ నెల 31న పార్టీపై ప్రకటిస్తానని వెల్లడించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పై స్పందించేందుకు డీఎంకే మహిళా నేత కనిమొళి నిరాకరించారు. ఓ కార్యక్రమంలో భాగంగా నీలగిరికి వచ్చిన ఆమె, మీడియాతో మాట్లాడుతున్న సమయంలో, రజనీ రాజకీయాల్లోకి రానుండటంపై స్పందించాలని మీడియా కోరగా, సమాధానం ఇచ్చారు.

ఆయన ఇంకా రాజకీయాల్లోకి రాలేదని గుర్తు చేసిన ఆమె, అటువంటి సమయంలో ఆయన గురించి స్పందించడం సరికాదని అన్నారు. అవినీతి రహిత పాలనను అందిస్తానని రజనీ చేసిన వ్యాఖ్యలు డీఎంకే గురించి చేసినవేనని ప్రస్తుత మంత్రి జయకుమార్ చెప్పడంపైనా తాను ప్రస్తుతానికి ఏమీ కామెంట్ చేయబోనని అన్నారు.