తనను ముస్తాబు చేస్తున్న వారిద్దరూ ఎవరో చూపించిన నిహారిక!

05-12-2020 Sat 08:36
  • 9న నిహారిక పెళ్లి చైతన్యతో
  • ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన పిక్ వైరల్
  • వారు అందంగా అలంకరిస్తారని చెప్పిన మెగా డాటర్
Niharika Clarifies Instagram Pic

మెగా ఫ్యామిలీ కొత్త పెళ్లికూతురు నిహారిక, వివాహానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో నిహారిక, చైతన్యల వివాహం పరిమిత అతిథుల మధ్య ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో నిహారిక ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఓ పిక్ వైరల్ అయింది.

ఇందులో నిహారిక కాళ్ల ముందు ఇద్దరు యువతులు కనిపిస్తున్నారు. వారిద్దరూ ఎవరన్న చర్చ నెట్టింట జరుగుతున్న వేళ, స్వయంగా నిహారికే వారెవరన్న విషయాన్ని బహిర్గతం చేసింది. తాను పోస్ట్ చేసిన పిక్ లో ఉన్న వారు తన హీల్స్ ను సరిచేస్తున్నారని తెలిపింది.

అక్కడ కనిపిస్తున్న ఇద్దరూ పెళ్లి కుమార్తెను ఎంతో బాగా సిద్ధం చేస్తారని తెలిపిన నిహారిక, అందుకే వారితో తనకు పరిచయం ఏర్పడిందని చెబుతూ, లవ్ యూ గర్ల్స్ అంటూ వారితో కలిసి తీయించుకున్న పిక్ ను మెగా ఫ్యాన్స్ కు చూపించింది. ఇప్పుడు ఈ పిక్ కూడా వైరల్ అవుతోంది.