సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

05-12-2020 Sat 07:09
  • ఒకే సినిమాలో పూజ హెగ్డే, రష్మిక?
  • పవన్ సినిమాకి పనిచేస్తున్న సీనియర్ రైటర్
  • పూర్తవుతున్న 'ఆర్ఆర్ఆర్' తాజా షెడ్యూల్
  • రెగ్యులర్ షూటింగులో నాగశౌర్య సినిమా  
Rashmika opposite Dulkhar Salaman

*  దుల్ఖర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో స్వప్నదత్ తెలుగు, మలయాళ భాషల్లో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఓ కథానాయికగా ఇప్పటికే పూజ హెగ్డేను తీసుకున్నారు. మరో హీరోయిన్ గా రష్మిక నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
*  పవన్ కల్యాణ్ హీరోగా ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఓ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ చిత్రానికి రచయితగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పని జరుగుతోందట.
*  రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా మహాబలేశ్వర్ ప్రాంతంలో జరుగుతోంది. హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా ఈ షూటింగులో పాల్గొంటున్నారు. కాగా, నేటితో ఈ షెడ్యూలు అక్కడ పూర్తవుతుందని తెలుస్తోంది.
*  నాగశౌర్య హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్ రెగ్యులర్ షూటింగ్ నిన్నటి నుంచి హైదరాబాదులో జరుగుతోంది. ఇందులో పాప్ సింగర్ షిర్లీ సెషియా కథానాయికగా నటిస్తోంది.