తొలి టీ20లో టర్నింగ్ పాయింట్ ఇదే: కెప్టెన్ కోహ్లీ

04-12-2020 Fri 22:07
  • ఆసీస్ పై విజయం సాధించిన భారత్
  • హార్దిక్ పాండ్య అద్భుత క్యాచ్ పట్టాడన్న కోహ్లీ
  • చహల్ పై ప్రశంసలు
 Team India skipper Virat Kohli comments on the match against Aussies

కాన్ బెర్రాలోని మనూకా ఓవల్ లో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ 11 పరుగుల తేడాతో ఆసీస్ పై విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం టీమిండియా సారథి విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, కాంకషన్ సబ్ స్టిట్యూట్ గా బరిలో దిగిన స్పిన్నర్ యజువేంద్ర చహల్ విజయంలో కీలకపాత్ర పోషించాడని కొనియాడాడు. అయితే ఆసీస్ కెప్టెన్ ఫించ్ ఇచ్చిన క్యాచ్ ను హార్దిక్ పాండ్య అందుకున్న తీరు అద్భుతమని, మ్యాచ్ ను మలుపు తిప్పింది ఇదేనని స్పష్టం చేశాడు. తుదిజట్టులో లేని చహల్ తమ ప్రణాళికల్లో లేడని, అనూహ్యంగా జడేజా గాయపడడంతో కాంకషన్ సబ్ స్టిట్యూట్ గా వచ్చి అద్భుతంగా బౌలింగ్ చేశాడని చహల్ కు కితాబిచ్చాడు.