భారత్ బయోటెక్ ను సందర్శించనున్న 80 దేశాల ప్రతినిధులు
- కొవాగ్జిన్ పేరిట కరోనా వ్యాక్సిన్ రూపొందించిన భారత్ బయోటెక్
- విదేశీ రాయబారులు, హైకమిషనర్లు హైదరాబాద్ రాక
- ఏర్పాట్లు చేస్తున్నామన్న సీఎస్
విదేశీ ప్రముఖులు వస్తుండడంతో రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్ సీనియర్ అధికారులతో పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. విదేశీ ప్రతినిధుల పర్యటనకు ప్రోటోకాల్ కు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు సీఎస్ వెల్లడించారు. అన్ని సౌకర్యాలతో కూడిన 5 బస్సులు, ప్రత్యేక వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. వారికి వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీలో హైదరాబాదు ప్రత్యేకతను వివరిస్తామని అన్నారు. ఫార్మాసిటీ, జీనోమ్ వ్యాలీ వివరాలతో ప్రజంటేషన్ తయారుచేస్తామని వివరించారు.