జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై అంబటి రాంబాబు వ్యంగ్య వ్యాఖ్యలు

04-12-2020 Fri 20:05
  • జీహెచ్ంఎసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 56 డివిజన్లు!
  • బోణీ కొట్టలేకపోయిన టీడీపీ
  • కాంగ్రెస్ కు 2 డివిజన్లు
Ambati Rambabu analyse GHMC results as party wise

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ గత ఎన్నికల ఫలితాలను పునరావృతం చేయలేకపోయింది. బీజేపీ, ఎంఐఎం ధాటికి 56 డివిజన్లకే పరిమితమైంది. దీనిపై ఏపీ రాజకీయనాయకుడు, వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు చావుతప్పి కన్నులొట్టబోయిందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో, గ్రేటర్ లో టీడీపీ చచ్చిపోయిందని, కాంగ్రెస్ కొనఊపిరితో ఉందని వ్యాఖ్యానించారు. కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ కనీసం బోణీ కూడా కొట్టలేకపోగా, కాంగ్రెస్ కు 2 డివిజన్లు దక్కాయి. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది.