బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ కంగనా రనౌత్ కు సిక్కు కమిటీ నోటీసులు
- రైతుల ఆందోళనల్లో పాల్గొంటున్న మహిళలపై విమర్శలు
- రూ. 100 ఇస్తే ఇలాంటి వారు చాలా మంది వస్తారని వ్యాఖ్య
- కంగనపై ఢిల్లీ గురుద్వారా మేనేజ్ మెంట్ కమిటీ ఆగ్రహం
వంద రూపాయలు ఇస్తే ఇలాంటి మహిళలు చాలా మంది వస్తారని కంగన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వారిని తాను కూడా చాలా మందిని తీసుకురాగలనని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై సిక్కు సంఘాలు మండిపడుతున్నాయి. ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్ మెంట్ కమిటీ కంగనకు నోటీసులు పంపింది. వారం రోజుల్లోగా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. అయితే, ఆ తర్వాత కంగన తన ట్వీట్ ను తొలగించింది. అయితే ఇంతవరకు కంగన క్షమాపణలు చెప్పలేదు. సిక్కు కమిటీ నోటీసులపై స్పందించలేదు.