దూసుకుపోయిన మార్కెట్లు.. తొలిసారి 45 వేల మార్కును దాటిన సెన్సెక్స్

04-12-2020 Fri 16:32
  • 447 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 125 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 4 శాతానికి పైగా లాభపడ్డ ఐసీఐసీఐ బ్యాంక్ షేర్
Sensex crosses 45k mark for the first time

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ తొలిసారి 45 వేల మార్కును దాటింది. ఈరోజు ఆర్బీఐ ప్రకటించిన పరపతి విధాన ప్రకటనతో ఇన్వెస్టర్లు హుషారుగా ట్రేడింగ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 447 పాయింట్లు లాభపడి 45,080కి ఎగబాకింది. నిఫ్టీ 125 పాయింట్లు పుంజుకుని 13,259 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (4.20%), అల్ట్రాటెక్ సిమెంట్ (4.10%), సన్ ఫార్మా (3.80%), హిందుస్థాన్ యూనిలీవర్ (2.85%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.77%).

టాప్ లూజర్స్:
రిలయన్స్ ఇండస్ట్రీస్ (-0.86%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.74%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.34%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-0.17%), ఎన్టీపీసీ (-0.10%).