అమూల్ రాకతో హెరిటేజ్ సామ్రాజ్యం కుప్పకూలుతుందని బాబు వణికిపోతున్నాడు: విజయసాయిరెడ్డి

04-12-2020 Fri 16:30
  • అమూల్ తో ఏపీ సర్కారు ఒప్పందం
  • అమూల్ పై బాబు విషం చిమ్మిస్తున్నాడన్న విజయసాయి
  • రాష్ట్రం పాల ఉత్పత్తిలో దూసుకెళుతుందని వ్యాఖ్య 
 Vijayasai Reddy says Chandrababu shivers in the wake of Amul entry into AP

ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. అమూల్ రాకతో వేల కోట్ల హెరిటేజ్ డెయిరీ సామ్రాజ్యం కుప్పకూలుతుందని బాబు వణికిపోతున్నాడని ఎద్దేవా చేశారు. దేశంలోనే అతిపెద్ద సహకార డెయిరీ అమూల్ పై పార్టీ నేతలతో విషం చిమ్మిస్తున్నాడని ఆరోపించారు. కిందపడి ఎంతలా కొట్టుకున్నా, పాల ఉత్పత్తిలో రాష్ట్రం రెండేళ్లలో అగ్రస్థానానికి దూసుకుపోతుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.