బిగ్ బాస్ కు ఎందుకెళ్లానో అర్థం కావడం లేదు: నోయల్

04-12-2020 Fri 16:16
  • బిగ్ బాస్ మనకు అవసరం లేదు
  • ఇప్పుడు నేను బిగ్ బాస్ చూడటం లేదు
  • హారిక, అభిజిత్ లకు మద్దతుగా ఉంటా
Didnt understand why I went to Bigboss says Noyel

బిగ్ బాస్ సీజన్ 4 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ఈ షోకు టీఆర్పీలో టాప్ రేటింగ్ వస్తోందని హోస్ట్ నాగార్జున ఇప్పటికే పలుసార్లు తెలిపారు. మరోవైపు ఎన్నో అంచనాలతో ఈ షోలోకి అడుగుపెట్టిన గాయకుడు నోయల్ ప్రారంభంలో మంచి ప్రేక్షకాదరణ సంపాదించాడు. టాప్ ఫైవ్ లో నిలుస్తాడని అందరూ భావిస్తున్న తరుణంలో అనారోగ్య కారణాలతో షో నుంచి బయటకు వచ్చాడు. వైద్య చికిత్స తీసుకుని మళ్లీ రీఎంట్రీ ఇస్తాడని అందరూ భావించినప్పటికీ... అది కుదరలేదు. షో నుంచి పూర్తిగా దూరమయ్యాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నోయల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అసలు బిగ్ బాస్ కు ఎందుకెళ్లానో కూడా తనకు అర్థం కావడం లేదని చెప్పాడు. బిగ్ బాస్ మనకు అవసరం లేదనే విషయం అర్థమైందని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం తాను బిగ్ బాస్ షో చూడటం లేదని చెప్పాడు. అయితే, హారిక, అభిజిత్ కు తాను మద్దతుగా ఉంటానని తెలిపాడు.