ఆసీస్ తో తొలి టీ20 మ్యాచ్... 7 వికెట్లకు 161 పరుగులు చేసిన టీమిండియా

04-12-2020 Fri 15:48
  • ఆసీస్ వర్సెస్ టీమిండియా
  • రాణించిన రాహుల్, జడేజా
  • విఫలమైన కోహ్లీ, ధావన్, పాండే
Team India set target Australia in Canberra

ఆస్ట్రేలియాతో తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 161 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 40 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 51 పరుగులు చేయగా, లోయరార్డర్ లో వచ్చిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 23 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. జడేజా స్కోరులో 5 ఫోర్లు, ఒక భారీ సిక్సు ఉన్నాయి.

వికెట్ కీపర్ సంజు శాంసన్ 15 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సుతో 23 పరుగులు సాధించాడు. ధావన్ (1), కెప్టెన్ కోహ్లీ (9), మనీష్ పాండే (2) విఫలమయ్యారు. హార్దిక్ పాండ్య 16 పరుగులు చేసి హెన్రిక్స్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మోజెస్ హెన్రిక్స్ 3, మిచెల్ స్టార్క్ 2, ఆడమ్ జంపా 1, మిచెల్ స్వెప్సన్ 1 వికెట్ తీశారు.