రామ్ చరణ్ సరసన రష్మిక?

04-12-2020 Fri 14:00
  • చిరంజీవి హీరోగా కొరటాల 'ఆచార్య'
  • కీలక పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్
  • పాత్ర నచ్చడంతో ఓకే చెప్పిన రష్మిక 
  • విద్యార్ధి నాయకుడి పాత్రలో చరణ్  
Rashmika to play heroine opposite Ram Charan

'సరిలేరు నీకెవ్వరూ', 'భీష్మ' చిత్రాల విజయాలతో కథానాయిక రష్మిక రేంజ్ టాలీవుడ్ లో బాగా పెరిగింది. స్టార్ హీరోలు చాలామంది ఆమెనే కోరుకుంటూ ఉండడంతో పారితోషికం కూడా పెంచేసింది. అయినా, ఆమెకు పలు ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో మరో స్టార్ హీరో రామ్ చరణ్ సరసన నటించే అవకాశం కూడా ఈ ముద్దుగుమ్మకు తాజాగా వచ్చినట్టు తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా రూపొందుతున్న సంగతి విదితమే. ఇందులో రామ్ చరణ్ అతిథిగా ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఆయన ఇందులో విద్యార్థి నాయకుడుగా కనిపిస్తాడని అంటున్నారు. ఆయన సరసన హీరోయిన్ కూడా వుంటుందట. దాంతో తాజాగా ఆ పాత్రకు రష్మికను సంప్రదించారట. పాత్ర నచ్చడంతో ఆమె ఓకే చెప్పినట్టు తాజా సమాచారం. వచ్చే ఏడాది ఆమె ఈ చిత్రం షూటింగులో జాయిన్ అవుతుందని అంటున్నారు.

ఇక 'ఆచార్య' షూటింగు విషయానికి వస్తే, గత కొన్నాళ్లుగా ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. చిరంజీవి కూడా నిన్నటి నుంచి షూట్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఆయనపై యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది.