పెళ్లంటే బొమ్మలాట కాదు... మైనర్ల వివాహంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వాసిరెడ్డి పద్మ

04-12-2020 Fri 13:15
  • రాజమండ్రిలో పెళ్లి చేసుకున్న మైనర్లు
  • ప్రేమ మోజులో పడి పెడదోవ పడుతున్నారన్న వాసిరెడ్డి పద్మ
  • బాలిక తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తామని వెల్లడి
Vasireddy Padma comments on Minor marriage in Rajahmundry

రాజమండ్రిలో ఇద్దరు మైనర్లు కాలేజీ తరగతి గదిలోనే పెళ్లి చేసుకున్న ఘటన తెలిసిందే. దీనిపై ఏపీ మహిళా కమిషనర్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పెళ్లంటే బొమ్మలాట కాదని వ్యాఖ్యానించారు. క్లాసు రూంలో పెళ్లి చేసుకోవడం పట్ల తాను విస్మయానికి గురయ్యానని తెలిపారు. మైనర్ బాలుడు, మైనర్ బాలిక చేసింది తప్పేనని, అయినప్పటికీ మైనర్ బాలికకు రక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు. బాలికను ఇంటి నుంచి గెంటివేసిన ఆమె తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పారు. పెళ్లి వయసు రాకముందే యువత ప్రేమ మోజులో పడి, తప్పుదారిలో నడుస్తోందని వాసిరెడ్డి పద్మ విమర్శించారు.