‘గ్రేటర్’ ఎన్నికల కౌంటింగ్ తొలి ఫలితం వెల్లడి

04-12-2020 Fri 12:48
  • మెహిదీపట్నంలో ఎఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ గెలుపు
  • గతంలో జీహెచ్ఎంసీ మేయర్‌గా పనిచేసిన మాజిద్
  • యూసుఫ్‌గూడ లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి రాజ్‌కుమార్ ప‌టేల్ విజ‌యం  
  • తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ మొత్తం ఎనిమిది స్థానాల్లో ఆధిక్యం
MIM wins in Mehdipatnam

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కౌంటింగ్‌లో తొలి ఫలితం వెలువడింది. మెహిదీపట్నంలో ఎఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ గెలుపొందారు. గతంలో ఆయన జీహెచ్ఎంసీ మేయర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే.

 మరోవైపు, యూసుఫ్‌గూడ డివిజ‌న్‌లో టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి రాజ్‌కుమార్ ప‌టేల్ విజ‌యం సాధించినట్లు ఆ పార్టీ తెలిపింది. తొలిరౌండ్‌లో బాలాజీనగర్, పటాన్ చెరు, భారతీ నగర్, శేరిలింగంపల్లి డివిజన్లలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది.

కాగా, తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ మొత్తం ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎంఐఎం తొలి రౌండ్లో ఒక్క స్థానంలో ఆధిక్యం కనబర్చి గెలిచింది.