నిహారిక ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో మెగా సందడి... మరికొన్ని ఫొటోలు ఇవిగో!

03-12-2020 Thu 20:32
  • చైతన్యతో త్వరలో కొణిదెల నిహారిక పెళ్లి
  • గతరాత్రి ఘనంగా ప్రీవెడ్డింగ్ వేడుకలు
  • హాజరైన మెగా కుటుంబ సభ్యులు
Pics of Niharika pre wedding celebrations

మెగాబ్రదర్ నాగబాబు తనయ నిహారిక, ఐపీఎస్ అధికారి కుమారుడు జొన్నలగడ్డ చైతన్యల ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. గతరాత్రి మెగా ఇంట జరిగిన ఈ వేడుకల్లో నిహారిక, చైతన్యలతో పాటు చిరంజీవి కుమార్తెలు సుస్మిత, శ్రీజ, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, చిరంజీవి మేనల్లుడు సాయితేజ్, అల్లుడు కల్యాణ్ దేవ్, అల్లు వెంకట్, శిరీష్ తదితరులు హాజరయ్యారు. బన్నీ అర్ధాంగి అల్లు స్నేహ కూడా ఈ వేడుకల్లో తళుక్కుమన్నారు. ప్రీవెడ్డింగ్ వేడుకలోనే జోష్ ను అంబరాన్నంటించారు. ఇక పెళ్లి వేడుకలో మెగా సందడి మామూలుగా ఉండదేమో!