నిజామాబాద్ లో కొత్త ఇల్లు కొన్న యాంకర్ శ్రీముఖి

03-12-2020 Thu 20:07
  • టీవీ షోలతో పాటు సినిమాలలో కూడా మెరుస్తున్న శ్రీముఖి
  • బిగ్ బాస్ లో రన్నరప్ గా సత్తా చాటిన స్టార్ యాంకర్
  • కొత్త ఇంటి ఫొటోలను షేర్ చేసిన శ్రీముఖి
Anchor Sreemukhi purchases new home at Nizamabad

టీవీ యాంకర్ గా బిజీగా ఉంటూనే అప్పుడప్పుడు సినిమాల్లో సైతం మెరుస్తోంది యాంకర్ శ్రీముఖి. బిగ్ బాస్ సీజన్-3లో పాల్గొన్న శ్రీముఖి రన్నరప్ గా నిలిచి సత్తా చాటింది. తాజాగా నిజామాబాద్ లో ఆమె కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. ఆ ఇంటి దగ్గర అమ్మ, నాన్న, తమ్ముడితో కలసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'న్యూ బిగినింగ్స్... ఫ్యామిలియా' అని క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఈ ఫొటోలను చూసిన వారు... వారు మీ పేరెంట్సా లేక తోడపుట్టినవారా?అని కామెంట్ చేస్తున్నారు. ఫొటోల కోసం కింద ఉన్న వీడియో చూడండి.