ఏపీ కరోనా అప్ డేట్: బాగా దిగొచ్చిన యాక్టివ్ కేసుల సంఖ్య

03-12-2020 Thu 18:49
  • గత 24 గంటల్లో 63,049 కరోనా పరీక్షలు
  • 664 మందికి పాజిటివ్
  • 835 మందికి కరోనా నయం
  • యాక్టివ్ కేసుల సంఖ్య 6,742
Corona active cases dropped in AP

ఏపీలో గడచిన 24 గంటల్లో యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,742 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. తాజాగా 63,049 కరోనా పరీక్షలు నిర్వహించగా, 664 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

అత్యధికంగా చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో 105 కేసుల చొప్పున వెల్లడయ్యాయి. విశాఖపట్నం జిల్లాలో 73, గుంటూరు జిల్లాలో 72, పశ్చిమ గోదావరిలో 70, తూర్పు గోదావరిలో 67 కేసులు గుర్తించారు. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 10 కేసులు వచ్చాయి. అదే సమయంలో 835 మంది కరోనా నుంచి కోలుకోగా, 11 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 7,014కి చేరింది.

కరోనా వ్యాప్తి మొదలయ్యాక రాష్ట్రంలో ఇప్పటివరకు 8,70,076 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,56,320 మంది మహమ్మారి వైరస్ నుంచి విముక్తులయ్యారు.